కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాలీలు

సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు ియూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా నియామకాలు
ిఖాలీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు రాజ్యసభలో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ వెల్లడి

న్యూదిల్లీ, డిసెంబర్‌ 5 : కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌ లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాలీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడిరచింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం పేర్కొన్నారు. ఖాలీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి కారణాలతో ఖాలీలు ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాలీలు పరిశీలిస్తే.. అక్టోబర్‌ 30 నాటికి సీఏపీఎఫ్‌, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు ఖాలీగా ఉన్నాయి.

అందులో అత్యధికంగా సీఆర్‌పీఎఫ్‌లో 33,730 పోస్టులు, సీఐఎస్‌ఎఫ్‌లో  q పోస్టులు, బీఎస్‌ఎఫ్‌లో 12,808 పోస్టులు, ఐటీబీపీలో 9,861 పోస్టులు, ఎస్‌ఎస్‌బీలో 8,646 పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో 3377 చొప్పున పోస్టులు ఖాలీగా ఉన్నాయి. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా ఈ ఖాలీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు వైద్య పరీక్షలకు సంబంధించి సమయాన్ని తగ్గించడం, కానిస్టేబుల్‌ జీడీ కోసం షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇక కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేసే సిబ్బంది శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఏపీఎఫ్‌ సిబ్బందికి ఏడాదిలో 100 రోజులు వారంతా కుటుంబంతో గడిపేలా మంత్రిత్వశాఖ కృషి చేస్తోందని తెలిపారు. 2020 నుంచి 2024 అక్టోబర్‌ వరకు 42,797 మంది సీఏపీఎఫ్‌, ఏఆర్‌ సిబ్బంది 100 రోజుల సెలవులు వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *