రోడ్డుపైనే ఆగిన రాజధాని డీలక్స్ బస్సు 

ఎస్సై వెంకట్ ప్రజల సహాయంతో పక్కకు నెట్టిన వైనం
ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 09 జెడ్ 8082 నెంబర్ గల రాజధాని డీలక్స్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఆమనగల్లు చేరుకోగానే బస్టాండ్ సమీపంలో చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. బస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించగా రాజధాని డీలక్స్ బస్సు కు చెందిన గేర్లు పడకపోవడంతో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
Rajdhani Deluxe bus
విషయం తెలుసుకున్న ఆమనగల్ ఎస్సై అక్కడికి చేరుకొని ప్రజలు ప్రయాణికుల సహాయంతో బస్సును వెనుక వైపు నుంచి నెట్టి పక్కకు తొలగించారు. దీంతో ట్రాఫిక్ సమస్య తొలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *