– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రిjá(‘సర’)పై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సహకారంతో తెలంగాణ మీడియా అకాడమీ నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించింది. కార్యక్రమానికి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తరఫున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.చెన్నయ్య, ఐటీ మేనేజర్ డి.చిరంజీవిలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరణ అందించారు. ఈ సందర్భంగా వారు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉద్దేశం, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులు, ఇంటింటి సర్వే తదితర అంశాలపై విపులీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు ఎసఐఆర్‌కు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకున్నారు. కార్యక్రమం జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా, సమాచారపూర్వకంగా సాగింది. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





