– సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన
– విచారణ జూలై 6కు వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కాలేదు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరినట్లు సమాచారం. అనంతరం న్యాయమూర్తి కేసు విచారణను జులై 6కి వాయిదా వేశారు. అల్లు అర్జున్‌ను ఎ-11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని తొలి పదిమంది జాబితాలో చేర్చగా మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. కేసు దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా పేర్కొంటూ నాంపల్లి కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించారు. నిందితుల వ్యక్తిగత హాజరు పక్రియ పూర్తయిన తర్వాత ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు నాంపల్లి కోర్టు సిద్ధమవుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.