హైదరాబాద్, నవంబర్ 22: అర్హులం దరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే సమగ్ర ఇంటింటి కుటు ంబ సర్వే ప్రధాన ఉద్దేశమని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఈ సర్వే దోహదపడుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.శుక్రవారం మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో, కాచిగూడ చెప్పల్ బజార్ కాలనీలలో సందర్శించి సామా జిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, ఉపాధి మరియు కుల వివరాల సేకరణకై చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భ ంగా ఆమె ఎన్యుమరేటర్ లను రోజుకు ఎన్ని ఇండ్ల సర్వే పూర్తి చేస్తున్నారు? ఏవైనా సమస్యలు ఉన్నాయా? ప్రజలు పూర్తి వివరాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. సర్వే ఎందుకు చేస్తున్నాం అన్నది ప్రజలకు తెలియ జేస్తున్నారా అని ఎన్యు మరేటర్లను అడిగారు. సర్వేకు వెళ్లినప్పుడు వారు అడిగిన సందేహాలను నివృత్తి చేయాలని సూపర్వైజర్, ఎన్యుమరేటర్ లకు సూచిం చారు. ఎన్యుమరేటర్ లు సర్వే గురించి ఓపికగా వివరించి వివరాలు సేకరిం చాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను ప్రతి డివిజన్ లో క్షేత్రస్థాయిలో స్వయంగా తిరిగి పరిశీలించడంతో పాటు సర్వే ఎందుకు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.
ప్రజలందరూ బాగా స్పందిస్తున్నారని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలు అందిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా మేయర్ కాచిగూడ చెప్పల్ బజార్ కాలనీలో గోపి సింగ్, ఆర్.వినోద్ ఇళ్లకు వెళ్లి సర్వే ఉద్దేశాన్ని వారికి వివరించి పూర్తి వివరాలను సేకరించి ఎన్యుమరేటర్ లతో నమోదు చేయించారు. అదేవిధంగా పక్కనే ఉన్న పలు ఇళ్లకు వెళ్లి సర్వే అయిపోయిందా? సర్వే చేయడం బాగుందా లేదా? ఏదైన ఇబ్బంది అవుతుందా అని వారిని ఆరా తీశారు. ఆయా ఇంటి యజమానులు తమ ఇంటి సర్వే పూర్తయిం దని, అడిగిన వివరాలు అన్ని ఇచ్చామని, ఎలాంటి ఇబ్బంది లేదని మేయర్ కు తెలిపారు. సర్వే ఉద్దేశాన్ని మీరు వివరించిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న అపోహ తొలగిపోయిందని వారు మేయర్ తో చెప్పారు. సర్వే పై ఎలాంటి తప్పుడు ప్రచారాలనుప్రజలు నమ్మవద్దని, సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లకు సరియైన వివరాలు అందించి సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. వివరాలన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
ప్రజా ప్రతినిధులందరూ విస్తృతంగా పర్యటించి ప్రజలకు సర్వే ఉద్దేశాన్ని వివరిస్తూ వివరాలు అందించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రేపటి ప్రజానికానికి, భవిష్యత్ కు ఈ సర్వే ఆధారమవుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన వివరాలను మాత్రమే తీసుకుంటున్నామని, ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. సర్వే విజయవంతంగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, మెడికల్ ఆఫీసర్ వెంకటరమణ, ఏ.ఎం.హెచ్.ఓ డా. హేమలత, సూపర్వైజర్ లావణ్య, ఎన్యుమరేటర్లు చంద్రకళ, ధనలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా అధికారులు తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారా హిల్స్ లోని శ్రీరామ్ నగర్ బస్తీ, జూబ్లీహిల్స్ లోని బోలె నగర్ లో సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట జూబ్లీహిల్స్ డి సి ప్రశాంతి, ఈ ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.