పండుగ వాతావరణంలో ప్రజా పాలన విజయోత్సవాలు

ిగడప గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలి.. ివిజయోత్సవాల్లో అందరినీ భాగస్వాములను చేయాలి
ిఈనెల 30న మహబూబ్‌ నగర్‌లో రైతు దినోత్సవ సభి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు
ిడిసెంబర్‌ 7, 8, 9వ తేదీల్లో ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ మార్గాలలో కార్నివాల్‌, లేజర్‌ షో,
ిసమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ిహాజరైన మంత్రులు ఉత్త మ్‌ , పొంగులేటి, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌ 22: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో చేపట్టిన విప్లవాత్మక పథకాల అమలు, కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి గడప గడపకు చెరవేసేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్బంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ- సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో పాఠశాల విద్యార్థుల దినోత్సవం, వరంగల్‌ లో మహిళా దినోత్సవం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్‌ నగర్‌ లో రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు వివరించారు. డిసెంబర్‌ 7, 8, 9వ తేదీలలో హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ మార్గాలలో కన్నుల పండవగా కార్నివాల్‌, లేజర్‌ షో, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

 

ఈ మూడు రోజుల ఉత్సవాల్లో మహిళలు, పిల్లలు, పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే, ప్రతీ జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నాయని, అదేవిధంగా ప్రతీ గ్రామ స్థాయి నుంచి, మండలాలు, జిల్లా స్థాయి వరకు ఈ ప్రజా విజయోత్సవాలు  నిర్వహించాలని తెలిపారు. ప్రతీ శాఖలో ఈ ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై అంతర్గతంగా వేడుకలు నిర్వహించుకోవాలని డిప్యూటీ సి.ఎం ఆదేశించారు. ఈ సంవత్సర కాలంలో చేపట్టిన విజయాలను ప్రతీ వ్యక్తికీ చేరవేసేలా సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ ఏడాది పాలనలో సాధించిన విజయాలను సక్సెస్‌ స్టోరీలను తమ వెబ్‌ సైట్లు, సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 లక్షల స్వయం సహాయక మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీలు, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ తదితర మహిళా సాధికారత పథకాల వివరాలన్నీ వారికి చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగులు, షార్ట్‌ ఫిలింలు, తదితర ప్రచార అంశాలను హోర్డింగులు, ప్రకటనలు, సోషల్‌ మీడియాలా ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 25 వేల ఆర్టీసీ బస్సులపై ఈ హోర్డింగులు ఏర్పాటు చేయాలను సూచించారు. ప్రధానంగా ప్రభుత్వ గ్యారెంటీలలో భాగంగా అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్య శ్రీ కవరేజి పెంపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ విద్యా సంస్థల ఏర్పాటు తదితర పథకాలపై పాఠశాల విద్యార్థులు వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఈ ప్రజా విజయోత్సవాలు పురస్కరించుకొని రాష్ట్రంలో నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాలల ప్రారంభోత్సవం, 200 విధ్యుత్‌ సబ్‌ స్టేషన్ల ప్రారంభం, 9007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయడం, ఆరు ప్రధాన పాలసీలను ముఖ్యమంత్రి చే ప్రారంభించుకోవడం తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్బంగా ఈ ప్రజా విజయోత్సవాలా నిర్వహణపై వివిధ శాఖల కార్యదర్శుల సలహాలు, సూచనలను డిప్యూటీ సిఎం స్వీకరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, ముఖ్య కార్యదర్శులు నవీన్‌ మిట్టల్‌, శైలజా రామయ్యర్‌, శ్రీధర్‌, క్రిస్టినా జోంగ్టు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్తా, హైదరాబాద్‌, సైబరాబాద్‌ నగర పోలీస్‌ కమీషనర్లు సి.వీ ఆనంద్‌, మొహంతి, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరీష్‌, ఫైర్సర్వీసుల డీజీ నాగి రెడ్డి, సి.ఎం. ఓ అధికారులు షా నవాజ్‌ కాసీం, మాణిక్‌ రాజ్‌, శ్రీనివాసులు, శ్రీరామ్‌ కర్రీ వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page