నాకు పార్టీ కన్నా తెలంగాణే ముఖ్యం

– కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
– ప్రాజెక్ట్ పునరుద్దరణపై కావాలనే ఆలస్యమన్న ఎంపీ ఈటల

హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 10: కాళే శ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నార ని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడు తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మా నేరు అని తెలిపారు. కరువు వొస్తుందని తెలి సీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని మం డిపడ్డారు. లోలెవల్ పాయింట్కు వచ్చే నీటి ని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నేను తెలం గాణ మట్టిబిడ్డను.. ఉద్యమకారున్ని.. అదే నా గుర్తింపు. నాకు తెలంగాణ ఫస్ట్.. తర్వాతే పా ర్టీ.. వ్యక్తిగతం. రాజకీయాల కోసం ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవరో మాట్లాడిస్తే నో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పుకోస మో మాట్లా డేవాళ్లం కాదు. అలా ఆరోపించే నీచులకు నే ను సమాధానం చెప్పాల్సిన అవ సరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీని, ఇంకో పార్టీని తిట్ట దానికి రాలేదు. పని చేయాల్సిన వారిని అడు గుతున్నా. దేవాదులకు బెరాజ్ లే దు.. లేకుండానే నీళ్ల పంపు చేస్తున్నారు. మేడిగడ్డ లో నీళ్లు నింపమని అడగడం లేదు.. ఉన్న నీళ్లను పంప్ చేయమని అడుగుతున్నా. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పడితే ఖబర్దార్. హైదరాబాద్్క ఇప్పుడే 107 ఓఉఆ నీళ్ల సరఫరా తక్కువ ఉంది. నీటి కొరత వస్తే ఎటు పోవాలి’ అని ఈటల ప్ర‌శ్నించారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *