హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : వర్షాకాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఫీడర్ వెంబడి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్రవ్యాప్తంగా పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సోమవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ సర్కిల్ పరిధి తిరుమలగిరి 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుండి వెలువడే 11 కేవీ వేణుగోపాల్ నగర్ ఫీడర్‌పై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ‘క్యూర’ పరిధిలోని అన్ని సర్కిళ్లలో 33 కేవీ సబ్‌స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఎల్‌టి. నెట్‌వర్క్‌లను సమగ్రంగా తనిఖీ చేసి వర్షాకాలానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలకు దారితీసే సమస్యలను ముందుగానే గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ ఇన్‌చార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్ జోన్
అనంతరం గన్‌రాక్‌లోని మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో మాన్సూన్ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా, లైన్ క్లియరెన్స్‌లు, ట్రీ ట్రిమ్మింగ్ పనులు, ఫీడర్ల నిర్వహణ, ట్రాన్స్‌ఫార్మర్ల భద్రత, అత్యవసర స్పందన వ్యవస్థలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మేడ్చల్ జోన్ చీఫ్ ఇంజనీర్ పి.వి. రమేష్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కరుణాకర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జోన్
రంగారెడ్డి జోన్ కార్యాలయంలో మాన్సూన్ సన్నద్ధత పనులు, నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ సరఫరా విశ్వసనీయత, ట్రీ ట్రిమ్మింగ్, లైన్ క్లియరెన్స్‌లు, వినియోగదారుల సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డైరెక్టర్ (కమర్షియల్ అండ్ హెచఆర్) చక్రపాణి, రంగారెడ్డి జోన్ చీఫ్ ఇంజనీర్ పాండ్యా నాయక్, జనరల్ మేనేజర్ (జీఎం) అంజయ్య, సైబర్ సిటీ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, సారూర్‌నగర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ డివిజనల్ ఇంజనీర్ రత్నాకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జీహె చ్‌ఎంసీ పరిధిలో ట్రీ ట్రిమ్మింగ్ పనులు
వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జీహె చ్‌ఎంసీ పరిధిలోని 11 కేవీ ఫీడర్లపై చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ట్రిమ్మింగ్) పనులను మంగళవారం నుండి విస్తృత స్థాయిలో చేపట్టనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం నెలాఖరు వరకు కొనసాగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



