హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం సాయంత్రం స్పీకర్.. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 8 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా 51 గంటల 52 నిమిషాలపాటు సభ సజావుగా సాగింది. ఈ సమావేశాల్లో 4 బిల్లులకు, మూడు ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. ఈనెల 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా తొలిరోజే అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలంతా నల్ల చొక్కాలు, చీరలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం ఆందోళనకు దారితీసింది. షర్టులపై ఎలాంటి రాతలు ఉండకూడదంటూ పోలీసులు అడ్డుకోవడం, బీఆర్ఎస్ మహిళా నేతలపై దాడి చేసిన ఘటనలు ఉద్రిక్త తకు దారితీశాయి. స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





