హైకోర్టు తీర్పు ఆ పార్టీల‌కు చెంపపెట్టు

– కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 18 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు లాంటి సమాధానమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీలోకి మారడం ప్రజాభీష్టానికి, రాజ్యాంగ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ విధానాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిందని, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారని విమర్శించారు. గెలిచిన పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారడం ప్రజా తీర్పును కాలరాయడమేనని, చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ తీర్పు నిరూపించిందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాకోర్టులోనూ ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *