- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
- కెయు ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ సమావేశం
హన్మకొండ, ప్రజాతంత్ర : ఎమ్మా ర్పీఎస్ (MRPS) పోరాట ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishan Madiga) అన్నారు. కెయు ఫార్మసీ సెమినార్ హాల్‌లో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి మాదిగ సమన్వయంలో కేయూ అధ్యక్షుడు కుమ్మరి శ్రీనాథ్ మాదిగ ఆధ్వ ర్యంలో ఆరోగ్య శ్రీ సాధన దినోత్సవ సమావే శం జరిగింది. ముఖ్యఅతిథిగా మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు తూ.. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్స చేయించి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుబాటు లోకి తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ 2004 ఆగస్టు 7న చేసిన ఉద్యమ ఫలి తంగానే ఆరో గ్యశ్రీ పథకాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ బీమా పథకం ఒక సంజీవినీలా పని చేస్తుందని మంద కృష్ణ అన్నారు.. ఆ పథకం స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని అన్నారు.
బొచ్చు తిరుపతి మాట్లాడుతూ.. కులం మతం కన్నా మానవత్వమే ముఖ్యమని భావించే మందకృష్ణ మాదిగ గత 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా సామాజిక, మానవతా ఉద్యమాలు నిర్మించి ప్రజలందరికీ సంక్షేమ,ఆరోగ్య ఫలాలు అందించారని అన్నారు. కుల రహిత సమాజం కోసం, ఆర్థికంగా, రాజకీయం గా ఎదిగేందుకు మందకృష్ణ మాదిగ భవి ష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు మనమంతా మద్దతుగా నిలవాలని కోరారు.

అనంతరం ఫార్మసీ కళాశాల ఆచార్యులు గాదె సమ్మయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిరుపేదల కోసం రెండు ఉద్య మాలు మంద కృష్ణ నేతృత్వంలో జరిగాయని తెలిపారు. మొదటిది ఫీజు రీయింబర్స్ మెం ట్ సంభాషణ ద్వారా విజయవంతమైనది. విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలలో విద్యావకాశాలను ఉపయోగించుకొని భావి పౌరులు గా వెలుగొందుతున్నారని తెలిపారు. ఇలాం టి విద్యార్థిని విద్యార్థులకు ఉజ్వల భవిష్య త్తును ప్రసాదించిన ఘనత మంద కృష్ణకి దక్కిందని తెలిపారు.
ఆర్థిక స్థోమత లేని ప్రజలు కార్పొరేట్ వైద్యం పొందడానికి ఆరోగ్యశ్రీ పథకం కోసం ఉద్య మం చేపట్టి సాధించారని తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కేయూ వీసీ కె.ప్రతాపరెడ్డిని పరామర్శించి ఆ రోగ్య సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్ర మంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫె సర్ జానపురెడ్డి కృష్ణవేణి, హాస్టల్ డైరెక్టర్ డా.. పోడేటి శ్రీనివాస్, అంబేద్కర్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డా.పుల్ల శ్రీనివాస్, డా. సంకినేని వెంకట్, ఎంఎస్ఎఫ్ సీనియర్ నా యకులు మంద భాస్కర్ మాదిగ, డా. వడ్డే పల్లి మధుకర్ మాదిగ, డా.లింగయ్య, డా. కొత్తపల్లి నాగేశ్వర్ రావు, డా.వడ్డేపల్లి మోహ న్, డా.రవీందర్, డా.వంగల సుధాకర్ బొక్క మొగిలి రవికుమార్ అడ్డూరి గణేష్ మాదిగ, భాషిపక తరుణ్, శిరీష, మౌనిక, సరిత, శిల్ప, కావ్య, పాల్గొన్నారు.





