– 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలి
– ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం జూన్ 2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జేఏసీ నాయకులు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కో-కన్వీనర్ బి.యాదగిరి మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి చర్యలు చేపట్టి శాసనసభలో బిల్లు కూడా పాస్ చేసిందని గుర్తు చేశారు. కేవలం విలీన తేదీని ప్రకటించాల్సిన సమయంలో ప్రభుత్వాలు మారాయని తెలిపారు. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా మంత్రులతో కూడిన ఉపసంఘం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి అధికారికంగా ప్రకటన చేసిందని చెప్పారు. అయితే విలీనం కంటే ముందు గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో కార్మికుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నదన్నారు. ఆర్టీసీ విలీనానికి అపాయింటెడ్ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2న ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరుతూ ఈనెల 31న సింగిల్ డిమాండ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో ఎర్ర బ్యాడ్జీలు ధరించాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




