– మొత్తం 95.1 శాతం ఉత్తీర్ణత
– 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందున్న బాలికలు
– ములుగు ఫస్ట్.. -హైదరాబాద్ లాస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను బుధవారం మధ్యా హ్నం విడుదల చేశారు. మొత్తం 95.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. ఈ ఏడాది 5 లక్షల 28 వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు: రాశారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచే యిగా నిలిచింది. బాలికలు 96.26 శా తం ఉత్తీర్ణత సాధించగా… బాలురు. 94.07 శాతం ఉత్తీర్ణత పొందారు. 5,731 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదవగా 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. పదో తరగతి ఫలితాలను 8096958096 ໑໓ ລ້ ຜ ద్వారా తెలుసుకోవచ్చు. సేవా వాట్సాప్ నెంబరు విద్యార్థులు హాయ్ అని మెసేజ్ టైప్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సి రిజల్టస్ అని టైప్ చేసి హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేస్తే ఫలితాలను చూడొ చ్చు. ఇకపోతే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంగ్లీష్ డియం విద్యార్థుల్లో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71 శాతం నమోద య్యింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 99. 30 శాతం ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





