– ప్రమాదంలో 30 మంది దుర్మరణం
న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్ యార్డ్ కూలడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా సహాయక బృందాలు వారిని హాస్పిటల్‌కి తరలించాయి. గినియా రాజధాని కొనక్రిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా డంపింగ్ యార్డ్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. మృతిచెందిన 30 మందిలో ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారనే అనుమానంతో రక్షణ బృందాలను రంగంలోకి దించినట్టు గినియా ప్రభుత్వం తెలిపింది. అయితే.. అక్కడ ప్రమాదం జరిగే అవకాశమున్నట్టు తాము ముందే ఊహించామని, స్థానికులను వేరే ప్రాంతానికి వెళ్లాలని ఇటీవలే ఆదేశించామని చెప్పింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



