యుద్ధం కొనసాగిస్తే అంతే సంగతులు

– ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వం
– అమెరికాకు ఇరాన్‌ ‌ఘాటు హెచ్చరికలు

న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్‌ ‌రెజాయీ ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రెజాయీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక యుద్ధం కొనసాగితే హోర్ముజ్‌ ‌జలసంధి ద్వారా మాత్రమే కాకుండా పర్షియన్‌ ‌గల్ఫ్ ‌నుంచి కూడా ఒక్క చుక్క చమురునూ ఎగుమతి చేయనీయమని రెజాయీ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక చర్యలకు మద్దతు ఇచ్చే లేదా వాటిలో భాగస్వాములయ్యే దేశాలను కూడా ఇరాన్‌ ‌శత్రువులుగా పరిగణిస్తుందని రెజాయీ హెచ్చరించారు. అలాంటి దేశాలపై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలకు సిద్ధమవుతోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ ‌బెసెంట్‌ ఈ ‌చర్యలను ’ఎకనామిక్‌ ‌డీ-డే’గా అభివర్ణించారు. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడమే తమ ఉద్దేశమని వాషింగ్టన్‌ ‌చెబుతోంది. అయితే ఇరాన్‌ ‌మాత్రం ఈ ఆంక్షలను ఎదుర్కొంటామని స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఇరాన్‌ ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఈ వారాంతంలో 20 కంటే తక్కువ వాణిజ్య నౌకలు మాత్రమే హోర్ముజ్‌ ‌గుండా వెళ్లినట్లు నౌకాయాన సమాచారం వెల్లడించింది. హోర్ముజ్‌ ‌ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇరాన్‌తో ఆట చివరికి వచ్చింది

– యూఎస్‌ ఆర్థిక మంత్రి స్కాట్‌ ‌బెసెంట్‌ ‌కీలక ప్రకటన

వాషింగ్టన్‌ : ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఆ దేశంపై ఆర్థిక యుద్దానికి సిద్ధమైంది అమెరికా. టెహ్రాన్‌కు సాయం చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించనుంది. ఈ పరిణామాల వేళ అగ్రరాజ్య ఆర్థిక మంత్రి స్కాట్‌ ‌బెసెంట్‌ ‌కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఆట చివరికొచ్చిందని, ఇక ఆ దేశానికి ఆర్థిక వినాశనమేనని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు ’ఎక్స్’ ‌ఖాతాలో పోస్ట్ ‌చేశారు. ఇరాన్‌ ‌సైనిక సామర్థ్యాలపై మేం గట్టి దెబ్బకొట్టాం. ఆ దేశ సైనిక ఫ్యాక్టరీలను 100శాతం ధ్వంసం చేశాం. అణు కార్యక్రమాన్ని సమాధి చేశాం. ఇక ఆట చివరికొచ్చింది. ఏ శత్రువుపైనా ఇప్పటివరకు చేపట్టని అతిపెద్ద ఆర్థిక యుద్దాన్ని ప్రారంభించబోతున్నాం. భద్రతా హాల ముసుగులో ఇన్నాళ్లూ ఇరాన్‌ ‌బెదిరింపులు చేస్తూ మనుగడ సాగించింది. అమెరికా తమనే చేయలేదని భావించింది. కానీ, ఇప్పుడు ట్రంప్‌. ‌హయాంలో ఆ శకం ముగిసింది. టెహ్రాన్‌ను ఒంటరి చేసేవరకు.. ఆ నిరంకుశ పాలనను నిలబెడుతున్న ప్రతి ఆర్థిక జీవనాధారాన్ని తెంచడమే మా లక్ష్యం అని స్కాట్‌ ‌బెసెంట్‌  ‌రాసుకొచ్చారు. ఇరాన్‌కు ఆర్థికంగా సహకారం అందిస్తోన్న దేశాలు తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవల ట్రంప్‌ ‌హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ప్రతి సంస్థ, ఏజెన్సీని తాము లక్ష్యంగా చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఆర్థిక యుద్ధం సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్కాట్‌ ‌బెసెంట్‌ ‌తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *