భ‌గ‌భ‌గ‌మంటున్న భానుడు

– పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ ,ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమైతే చాలు భానుడు భగ్గుమంటున్నాడు. దాంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిిన జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీచేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *