పాఠశాల స్థలానికి రక్షణ కల్పించాలి

– సీఎస్ఆర్ నిధులతో భవనం నిర్మించాలి
– అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనపరచుకోవాలి
– విద్యా పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల ర్యాలీ, ధర్నా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : పటాన్‌చెరు జెడ్పీహెచ్ఎస్ స్థలాన్ని రక్షించాలని, కాంపౌండ్ వాల్‌తోపాటు పాత భవనాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పటాన్‌చెరు పాఠశాల పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఫ్రీడం పార్కు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు ధర్నా జరిపి తహసీల్దారుకు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ అధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వి.సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు బైండ్ల కుమార్, శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ యాభ్యఏ్యళ్లపాటు ఉన్నతంగా వెలుగొంది వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల స్థలానికి ఇలాంటి దుస్థితి రావడం శోచనీయమన్నారు. 13 ఏళ్ల క్రితం పాఠశాల భవనం శిథిóలావస్థలో ఉందని విద్యార్థులను తాత్కాలికంగా ప్రాథమిక పాఠశాల భవనానికి తరలించారని, ఇన్నేళ్ళయినా నూతన భవనం నిర్మించకుండా ఇరుకైన, ఆట స్థలం కూడా లేని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోనే ఉన్నత పాఠశాలను కొనసాగించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని కొందరు ప్రయత్నించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు అనుమతితో నిర్మించిన ప్రహారీని రాత్రికి రాత్రి కూల్చివేయడం చాలా దారుణమని, ప్రహరీ కూలుస్తుంటే పాత భవనం నేలమట్టమైందని తప్పుడు నివేదిక ఇవ్వడం అక్షేపణీయమని అన్నారు. సుప్రీం కోర్టులో సమర్థుడైన లాయర్‌ను  ప్రభుత్వం నియమించి ఆ స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని, కోర్టు అనుమతితో ప్రహరీ నిర్మించినట్టే అదే స్థలంలో సీఆరఎస్ నిధులతో హైస్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆక్రమించి గుడారాలు ఏర్పాటు చేసుకున్న 9 గుంటల పాఠశాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు రాజారెడ్డి, సంజీవయ్య, అశోక్, నాసర్ పటేల్, శ్రీనివాస్‌చారి, ప్రకాష్ రావు, మల్లికార్జున్, జనార్దన్, టీఎసఈసీ నాయకులు లక్ష్మి, మానస, శ్రీధర్ మహేంద్ర, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాలు పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి నాయకులు ఆశిష్ గౌడ్, విజయ్ కుమార్, ఆర్‌వీఎస్ రవి, వి.రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు రమేష్, నర్సింలు, నాగభూషణం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *