“ప్రధానంగా రాష్ట్రంలోని పలు మండలాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. పండ్లు, కూరగాయలతో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, వేరుశెనగ తదితర పంటలు ఏవివేసుకున్నా కోతులబారినుండి వాటిని కాపాడుకోవడం కష్టం. అందుకు ప్రత్యమ్నాయం ఏమిటంటున్నారు రైతాంగం. అలాగే ఈ రంగానికి విద్యుత్ విషయంలో ప్రభుత్వం నిబంధన విధించింది. ఉదయం ఏడు గంటనుండి సాయంత్రం నాలుగు గంటల వరకే విద్యుత్ సరఫరా ఉంటుందని. రైతులంతా ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తే జరిగే పరిణామం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. పోనుపోను విద్యుత్ డిమాండ్‌కూడా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి 20వేల మెగావాట్లు ఉన్నదల్లా త్వరలో 23 నుండి 27 మెగావాట్ల వరకు డిమాండ్ ఉండే అవకాశముంది. అదనపు విద్యుత్‌ను కొనలేమంటున్న ప్రభుత్వం ప్రత్యమ్నాయ పంటలకు విద్యుత్‌ను ఎలా అందిస్తుందన్న అనుమానాన్ని రైతులు వ్యక్తంచేస్తున్నారు.”
తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను శాస్త్రీయంగా ఎంపిక చేయలేదన్న విమర్శ సర్వత్రా వినవస్తున్నది. అనేక మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం కొన్ని మండలాలనే పరిగణలోకి తీసుకుందన్న ఆరోపణలున్నాయి. కనీస నీటివసతిలేని గ్రామాలను అధికారులు గుర్తించలేకపొయారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని మండలాల్లో ఏదోవిధమైన నష్టానికి వ్యవసాయం దెబ్బతిన్నందున తెలంగాణ రాష్ట్రాన్నే కరువు రాష్ట్రంగా గుర్తించాలన్న డిమాండ్ రైతులు, ప్రజాప్రతినిధులనుండి వినవస్తున్నది. రాష్ట్రంలో ఎల్‌నినో, తక్కువ వర్షపాతం కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో 111 మండలాలను అత్యధిక కరువు ప్రాంతాలుగా, 254 మండలాలను ఒక మోస్తరు కరువు ప్రాంతాలుగా పేర్కొంది. అయితే ఇది అశాస్త్రీయ ఎంపిక అని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.
అత్యధికంగా 35శాతం వర్షపాతంకన్నా తక్కువున్న ప్రాంతాలను ఈ జాబితాలో చేర్చకపోవడం ఆ ప్రాంతాలకు అన్యాయం చేయడమే అవుతుందంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దీనిపై తీవ్రంగా స్పందించారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజురాబాద్ ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్తితులు నెలకొన్నాయని వాటిని పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇంతకు కరువు ప్రాంతాలను ఏ ప్రమాణికతో ఎంపిక చేశారన్న విషయాన్ని బహిర్ఘతం చేయాలని రైతుసంఘాలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్షపాతంలోటు, సాగు విస్తీర్ణం, పంటనష్టం, నేలలో తేమశాతం, భూగర్భజలాల స్థితిగతులు, రానున్న కాలంలో పంట పరిస్థితి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు రాష్ట్రంలోని దాదాపు అన్ని మండలాల్లోని గ్రామాలన్నిటిలో ఏదో లోపం కనిపిస్తుందన్న వాదనను వినిపిస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిని తీసుకుంటే హుజురాబాద్ అత్యధికంగా 6.36 మీటర్లలోతుకు భూగర్భ జలాలు పడిపోయినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కరువు జాబితాలో చేర్చలేదు. ఆవిధంగా రెండు నుంచి నాలుగు మీటర్ల లోతుకు జలాలు దిగజారిన మండలాలు అనేకమున్నాయి. అయినా వాటిని జాబితాలో చేర్చలేదన్న విమర్శఉంది. అదేవిదంగా పెద్దపల్లి శాసనసభ నియోజవర్గంలోని ఒక్క మండలాన్నికూడా కరువు జాబితాలో చేర్చకపోవడంపట్ల అక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కరువు నిధులను సమకూర్చాల్సివస్తుందన్న అభిప్రాయంగానే ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా నష్టపోయిన రైతాంగానికి యుద్ధప్రాతిపధికన ఆర్థికసహాయాన్ని అందించాలని పలు రాజకీయపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే సహాయకచర్యలకుగాను కార్యాచరణ ప్రణాళికనుకూడా సత్వరం అమలుచేయాలంటున్నారు. కొన్ని మండలాలు కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాన్నే కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ, నష్టంవాటిల్లిన వరిపంటకు ఎకరానికి 30వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. అలాగే పత్తి, మిర్చి రైతులకు 50వేలు, ఇతర పంటలకు 20వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సర్వే జరిపి కరువు ప్రాంతాలను గుర్తించాని సిపిఎం సూచిస్తున్నది. కరువు కారణంగా సాగుచేయలేకపోయిన రైతులకు, వ్యవసాయ కూలీలకు కనీసం నెలకు పదిహేను వేల నష్టపరిహారం అందించాలని, ధరల భారాన్ని ఎదుర్కునేందుకు కార్మికులకు డిఏ వర్తింపజేయాలని, రైతుకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.
ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎకరానికి 50వేల నష్టపరిహారం అందించాలని బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే కేంద్రం,రాష్ట్రం చెరి 25వేల సహకారాన్ని అందించాలంది. నష్టపోయిన పంటలకు పరిహారం అందించడంతోపాటు యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలనికూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం వరి వేసుకోవద్దంటున్న క్రమంలో ప్రత్యమ్నాయ పంటలకు ప్రభుత్వంనుండి అందించే సహకారమేంటన్నది స్పష్టం చేయాలంది. ప్రధానంగా రాష్ట్రంలోని పలు మండలాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది.
పండ్లు, కూరగాయలతో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, వేరుశెనగ తదితర పంటలు ఏవివేసుకున్నా కోతులబారినుండి వాటిని కాపాడుకోవడం కష్టం. అందుకు ప్రత్యమ్నాయం ఏమిటంటున్నారు రైతాంగం. అలాగే ఈ రంగానికి విద్యుత్ విషయంలో ప్రభుత్వం నిబంధన విధించింది. ఉదయం ఏడు గంటనుండి సాయంత్రం నాలుగు గంటల వరకే విద్యుత్ సరఫరా ఉంటుందని. రైతులంతా ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తే జరిగే పరిణామం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. పోనుపోను విద్యుత్ డిమాండ్‌కూడా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి 20వేల మెగావాట్లు ఉన్నదల్లా త్వరలో 23 నుండి 27 మెగావాట్ల వరకు డిమాండ్ ఉండే అవకాశముంది. అదనపు విద్యుత్‌ను కొనలేమంటున్న ప్రభుత్వం ప్రత్యమ్నాయ పంటలకు విద్యుత్‌ను ఎలా అందిస్తుందన్న అనుమానాన్ని రైతులు వ్యక్తంచేస్తున్నారు.





