భారీ వర్షాలతో రైతు ఆశీర్వాద సభ రద్దు

– శిల్పకలా వేదికగా రేపు రైతు భరోసా నిర్వహణ

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయ్యింది. వర్షాల కారణంగా సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మధిరలో జరగాల్సిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి సభలో మార్పులు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌శిల్పకళా వేదికకు మార్చారు. సాయంత్రం రైతుభరోసా పంపిణీ సదస్సు నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో మంగళవారం రైతు ఆశీర్వాద సభ జరగాల్సి ఉంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని జగన్నాథపురంలో ఏర్పాట్లు చేశారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలకు సభా ప్రాంగణంలో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. దీంతో సభ నిర్వహించేందుకు అవకాశం లేదని మంత్రులు, సీఎంవో కార్యాలయానికి జిల్లా అధికారులు తెలియజేశారు. దీంతో ప్రభుత్వం మధిరలో సభను రద్దు చేసి సభా వేదికను హైదరాబాద్‌కు మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమతమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *