– సమాచారం ఇచ్చిన 3 లక్షలమంది ప్రజలు
– ఈనెల 25తో ముగియనున్న సర్వే
హైదరాబాద్, అక్టోబర్ 21 : రాష్ట్ర భవిషత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేను చేపట్టింది. గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25వ తేదీతో ముగియనుంది. www.telangana.gov.in /telanganarising అనే వెబ్‌సైట్‌లో సందర్శించి ప్రతీ ఒక్కరు తమ సలహాలు సూచనలను అందించాల్సిందిగా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





