– ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ విజేత పోలీస్ టీమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీని పోలీస్ క్రికెట్ టీం గెలుపొందింది. ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో టాలీవుడ్ టీంపై పోలీస్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది. విన్నర్ టీమ్‌కు లభించిన రూ.5 లక్షలు, రన్నర్ టీమ్‌కు లభించిన రూ. 3 లక్షల నగదు బహుమతిని పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని పోలీసు సంక్షేమ నిధికి అందజేశారు. ఈమేరకు నిర్వాహకులు చెక్కును రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ సీవీ ఆనంద్‌కు సచివాలయంలో మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ క్రికెట్ టీమ్ సభ్యులతోపాటు, బీసీసీఐ, ప్రణవ గ్రూప్ ప్రతినిధులు పాల్గొనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





