తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

– వెబ్‌సైట్‌లో అందుబాటులోకి..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 16,726 మంది అభ్యర్థులు (93.60 శాతం) క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని, జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫీజులు గత ఏడాది మాదిరిగానే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 15న  నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల మార్కుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా(పాలిటెక్నిక్), బీఎస్సీ(మ్యాథమెటిక్స్) పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్, బీఫార్మసీ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టేష్రన్ నంబర్‌ను నమోదు చేసి స్క్రీన్‌పై ఫైనల్ ర్యాంక్‌ను చూసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే కేటగిరీల వారీగా కౌన్సెలింగ్ తేదీలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. అడ్మిషన్ల పక్రియ ముగిసే వరకు విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను, హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *