– పవన్ వ్యాఖ్యలపై గద్దర్ తనయ వెన్నెల విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 3: తెలంగాణ అయ్య జాగీరా..? అంటూ జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్, గద్దర్ కూతురు వెన్నెల తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో వెన్నెల మాట్లాడుతూ.. పవనన్న మిమ్మల్ని ఒక నటుడిగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం రోజు రు మాట్లాడిన మాటలను ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానన్నారు. తెలంగాణ సినిమాల్లో నటిస్తే రాలేదు.. తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు. పైసలు పంచితే రాలేదు.. లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవపోరాటం. ఎవరినీ ఒక్క బాధపెట్టుకుండా.. హింసించకుండా తమను తాము ఆహూతి చేసుకున్న శ్రీకాంతాచారే సాక్ష్యమన్నారు. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్దం. పాటలతో మాటలతో ప్రజల్లోకి వెళ్లి.. గడపగడపకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసిన పోరాట గాథలున్న ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి.. మా నీళ్లు మావి..మా పాలన మాది అనే నినాదంతో ప్లలెప్లలె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తెలంగాణ మా అయ్యల జాగీరే, రేపు మా బిడ్డల జాగీరు కూడా అంటూ వెన్నెల వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




