– అడిషనల్ ఎస్పీ భుంజగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు, అరెస్ట్
హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 3: నగరంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టి ఆయనను అరెస్టు చేశారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉండి అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్ కు వెళ్లి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. పోలీస్ శాఖలో పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో ఆయనకు సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఐదు ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు, హైదరాబాద్‌లో కమర్షియల్ భవనం, కిలో బంగారు నగలు, బ్యాంకు ఖాతాలో రూ.3.83 లక్షలున్నట్లు తేలింది. సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన సొత్తును గుర్తించారు. 29 మద్యం సీసాలు కూడా లభించడంతో ఏసీబీ అధికారులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




