కాంగ్రెస్‌ ‌దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విమర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌దిల్లీ దర్బార్‌కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ ‌రాక్‌ ఎం‌క్లేవ్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. మోదీ నేతృత్వంలో బీజేపీ వెంట నడిచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీను గెలిపించిన రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. దేశంలో 12 ఏళ్లలో చాలా పరివర్తన వచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పశ్చిమబెంగాల్‌లో ఎలా గెలిచారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. కార్యకర్తల కష్టాలతో పశ్చిమబెంగాల్‌లో గెలిచామని చెప్పాను. అక్కడ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారు.. అయినా లెక్కచేయకుండా బీజేపీని గెలిపించాలనే ఆలోచనతో వారు పనిచేశారు. అని కొనియాడారు. ‘సర్‌’పై ప్రజలకు బీజేపీ కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణలో ‘సర్‌’పై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇక్కడినుంచి దిల్లీకి డబ్బులు వెళ్తున్నాయి.. దిల్లీ దర్బార్‌కు తెలంగాణ ఏటీఎంగా మార్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు ఇచ్చింది.. కానీ ఒక్కటికూడా పూర్తి చేయలేదు. కాంగ్రెస్‌.. అవినీతి, నేరాల తరహా పాలన చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, ‌బీఆర్‌ఎస్‌ ‌కలిసే ఉన్నాయి. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని నితిన్‌ ‌నన్నారు.న్‌ ఆరోపించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ‌పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *