Tag Social justice

సామాజిక న్యాయంలో మరో మైలురాయి!

ఇటీవల తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో జరిగిన ఒక ఘటనపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయ సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సంస్థలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేసిన కె. రామకృష్ణారెడ్డి 2014లో మరణించగా, ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆయన కుమార్తె కుంభం జ్యోతి కారుణ్య నియామకం కోసం…

బడుగులకు రాజ్యాధికారం పగటి కలేనా?

దగాపడ్డ దళితులారా! బహుజనులారా! బడుగు బలహీన వర్గాల ప్రజలారా! ఇక మనకు రాజ్యాధికారం పగటి కలే కాబోతుందా? పాలనా అధికారం పొందని బలహీన వర్గాల ప్రజలు, ఎప్పటికీ పేదలుగానే పాలితులుగానే ఉండి పోవలసిందేనా? తరతరాలుగా ఈ దేశంలో రాజ్యాధికారం, ఆధిపత్య కులాల పెత్తందారుల చేతుల్లో, సంపన్న వర్గాల చెరలో బంధీ అయి ఉంది! స్వాతంత్ర్యం వచ్చిన…

రోహిత్ వేముల బిల్లు… ఒక సామాజిక ముందడుగు!

ఉన్నత విద్యాసంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలు మాత్రమే కాదు, సమానత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలను నేర్పే సామాజిక ప్రయోగశాలలు కూడా కావాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేటికీ దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కుల వివక్షకు, వ్యవస్థాగత అణచివేతకు కేంద్రాలుగా మారుతుండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షను శాశ్వతంగా నిర్మూలించేందుకు…

కమ్యూనిస్టులు కళ్ళు మూసుకున్నారా..! ?

“ఇప్పటి విద్యుత్ చార్జీల అంశం మరింత కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బషీర్‌బాగ్ వరకు వెళ్లిన ఉద్యమ చరిత్ర వామపక్షాలకు ఉంది. ఆ పోరాటం కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు; సామాన్యుడిపై పడే ఆర్థిక భారానికి వ్యతిరేకమైన రాజకీయ ప్రతిస్పందన. ఇప్పుడు తెలంగాణలో ట్రూ-అప్ పేరుతో వినియోగదారులపై అదనపు విద్యుత్…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

అక్టోబర్ 8… పౌర హక్కుల పోరాట యోధుని వర్ధంతి పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత బాలగోపాల్ కే దక్కుతుంది. బాలగోపాల్ ఒక మధ్యతరగతి తెలుగు బ్రాహ్మణ దంపతుల ఎనిమిది మంది పిల్లలలో ఐదవ సంతానం- కందాళ్ళ పార్థనాథ శర్మ మరియు రాళ్ళపల్లి నాగమణి దంపతులకు బాలగోపాల్ 1952, జూన్ 10న బళ్ళారి, కర్ణాటకలో…

ఇదీ ఒక వివక్షా రూపమే? చావు-డప్పు!?

“అసలు ఎవరైనా చావు ఎందుకు కోరుకుంటారు.చావు కోరుకునేవారు మానసిక రోగైనాకావాలి, జీవితం మీద విరక్తి అయినా చెందాలి.లేదా కక్ష్య, కార్పణ్యాలు ఉన్నవారే!వాటిని కోరుకుంటారు.వారసులైతే ఆస్తిపాస్తులు పోతే ఆస్తి తమకే దక్కుతుందని కోరుకుంటారు.మరి రాజకీయ నాయకులైతే! తమ అధికారానికి అడ్డం, నిలువు అని భావించినప్పుడే చావు కోరుకుంటారు. నిరాశా,నిస్పృహలు కూరుకుపోయిన వారే అలా భావిస్తారు.రెండేళ్ళ కాలపరిమితి కాసుకొని…

యూనిఫార్మ్ సివిల్ కోడ్, విశ్వాస లోటు!

“ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా ఒక పెద్ద సామాజిక మార్పును తీసుకురావడానికి చట్టాల కంటే ముందుగా ప్రజల మనస్సుల్లో నమ్మకాన్ని నింపడం అత్యంత ప్రధానమైన బాధ్యత. ప్రజల భాగస్వామ్యం లేకుండా లేదా వారి అనుమానాలను నివృత్తి చేయకుండా చేసే చట్టాలు సామాజిక అసంతృప్తికి, నిరసనలకు దారితీస్తాయి..” భారతదేశంలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి…

దళితుల ఆత్మగౌరవంపై రాజకీయాలు మానుకోవాలి

మన దేశంలో కులం మరియు మతం తమదైన పాత్రను పోషిస్తూ ఉంటాయి, ప్రజలు సైతం కులం మతం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కులాంతరాలు లేని సమసమాజాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి రాష్ట్ర రాజకీయాలు మొత్తం దళితుల చుట్టూ తిరుగుతున్నాయి కాదు కాదు…

స‌మాన‌త్వ హ‌క్కుల అమ‌లులో ఆలస్యం ఎందుకు ?

సమాజంలో తీవ్ర వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల ఉపాధి ,సమానత్వ హక్కులపై తెలంగాణ హైకోర్టు మరో కీలకమైన, చరిత్రాత్మక చొరవను తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక కారణాల…