- నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు
– ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : తమ ప్రభుత్వం చేపట్టిన ’తెలంగాణ రైజింగ్’ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో శిక్షణ పొందిన యువతకు ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని వివరించారు. ఈ మేరకు సీఎం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇటీవల జరిగిన నియామకాల్లో ష్నైడైర్ ఎలక్ట్రిక్ సంస్థలో 47 మంది యువకులు ఉద్యోగాలు పొందారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పుణెలోని టాటా మోటార్స్ యూనిట్‌లో 36 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పుకొచ్చారు. అలాగే ఫాక్స్‌కాన్ సంస్థకు చెందిన ఆపిల్ ఐఫోన్ విభాగంలో 14 మంది మహిళా విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. బ్లూ కాలర్ ఉద్యోగాల రంగంలో తెలంగాణను దేశానికే కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందిస్తూ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న నైపుణ్యవంతమైన మానవ వనరులు, పారిశ్రామిక అనుకూల విధానాలు, మెరుగైన మౌలిక వసతులు ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షిస్తున్నాయని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశముందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





