– వరంగల్ జిల్లా పాపయ్యపేట వాసులుగా గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: మేడ్చెల్ జిల్లాలోని ఘట్‌కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు. ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సపంలోని ఘట్‌కేసర్- బీబీనగర్ రైల్వే మార్గంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నరు. విషయం తెలిసిన వెంటనే జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దంపతుల మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రవికుమార్, శిరీష మృతితో పాపయ్యపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




