నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం
– ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (23వ తేదీ)తో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా ముగిసింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి విరామం ప్రారంభం కానుంది. జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. సాధారణంగా ఏప్రిల్ ఆఖరు వరకు తరగతులు నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి ఎండలు తీవ్రమవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఒక ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో ‘తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం’ నిర్వహించాలని సూచించింది. ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతి నివేదికలను అందజేయడమేకాÅ£ వేసవి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చర్చించాలని తెలిపింది. వరుస పరీక్షల ఒత్తిడి తర్వాత విద్యార్థులకు ఈ 50 రోజుల సెలవులు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉన్నందున పిల్లలు బయట తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలావుండగా ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లాలనుకున్న వారికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. సమ్మె ముగిస్తేనే ఎక్కడికైనా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *