కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చ

– తదుపరి కార్యాచరణపై స‌బ్ క‌మిటీలో నిర్ణయం
– మంత్రి ఉత్తమ్ వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్23: కాళేశ్వరం అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రుల సబ్కమిటీ వేసుకుని.. చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వ్యవహారం పై సీబీఐకి లేఖ రాసి  నెలలు గడిచినా ఎందుకు ముందుకెళ్లట్లేదో మీరే అర్థం చేసుకోవచ్చన్నారు. తాను, సీఎం రేవంత్ త్వరలో సీబీఐ డైరెక్టర్ను కలవబోతున్నట్లు వెల్లడించారు. ‘కాళేశ్వరం అవకతవకలపై వేసిన కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్ వేశారు. అయితే, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కేసీఆర్, హరీశ్రావుల ప్రధాన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. కమిషన్ ను చట్టవిరుద్ధం కాదని.. నివేదిక కొనసాగుతుందని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సాంకేతిక అంశాల కారణంగానే కేసీఆర్, హరీశ్రావులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వారిద్దరూ నిర్దోషులని, కాళేశ్వరం అవకతవకలకు బాధ్యులు కారని ఉన్నత న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. అభిషేక్ సింఘ్వీని కలిసి తదుపరి కార్యాచరణ చేపడతామఅని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *