– రూ.లక్ష బహుమతి అందుకోండి
– ఈనెల 28 వరకు సోషల్ మీడియాలో పోటీ నిర్వహణ
– హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు(ఎలఐజీ) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన వారికి రూ.లక్ష బహుమతిని అందజేస్తామని, సోషల్ మీడియా వేదికగా ఈనెల 28 వరకు బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా లక్ష ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎలాంటి వివాదాలు లేకుండా, అందుబాటు ధరల్లో వివిధ వర్గాల ప్రజల సొంత ఇంటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది. అంతే కాక బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టులకు ప్రజల నుంచి ఆదరణతోపాటు డిమాండ్ కూడా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘం కాలం తరువాత చేపడుతున్న ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచనతో ప్రజల నుంచి అందే సూచనలతోనే పథకానికి పేరును కూడా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హౌసింగ్ బోర్డుకు చెందిన tghd.official పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ https://www.instagram.com/p/
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





