– తెల్లవారుజాము నుంచే పలుచోట్ల ఏక కాలంలో తనిఖీలు
నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: హైదరాబాద్ నగరంలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ దాడులు చేపట్టారు. హైదరాబాద్, నిజామాబాద్‌లో మొత్తం పదిచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మూడు సంవత్సరాల క్రితం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా మల్లారెడ్డి విధుల్లో చేరారు. ఇటీవల ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయ్యింది. దీంతో తెల్లవారుజామునే ప్రత్యేక బృందాలు నిజామాబాద్ చేరుకుని.. అక్కడి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఆఫీసులో విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బందిని కూడా విచారించారు. ప్రగతినగర్‌లో మల్లారెడ్డి అద్దెకు ఉంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.