– జైల్ భరోతో దద్దరిల్లిన భద్రాచలం
– భారీ రాస్తారోకోతో స్తంభించిన రాకపోకలు
– పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగష్టు 10: కార్మిక కర్షక హక్కుల పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు ఎక్కారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐకేఎస్, ఎలఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం ఉదృతంగా సాగింది. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద భారీ రాస్తారోకో నిర్వహించడంతో రహదారిపై వాహనాల రాకపోకలు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయి. నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఉద్య మిద్దం.. హక్కులను రక్షించుకుందాం.. కార్మికుల కోసం దేశ సంప డను దోచిపెడుతున్న కార్పొ రేట్లకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ కార్యకర్తలు నినదించారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల (ప్రైవేటీకరణను ఆపాలని, స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకతో భారీగా వాహనం నిలిచిపోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలాన్ని చేరుకొని బలవంతంగా నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరగగా కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నాయకుల అరెస్టు నిరసిస్తూ కార్యకర్తల పెద్ద సంఖ్యలో భద్రాచలం పోలీస్ స్టేషన్ చేరుకొని స్టేషన్లోని బెటాయించి జైల్ జరోని విజయవంతం చేశారు.
కార్మిక హక్కులపై దాడిని సహించేది లేదు.. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్
సిఐటియు కన్వీనర్ బండారు. శరత్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ. కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలపై వదిలే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దేశ సంవదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను తిప్పికొట్టేం. దుకు కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమిం చాలని పిలువ నిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, లేబర్ కోట్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని ఐలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది ఆయన స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలను మరింత ఉధ్భతం ఏది రమేష్ హెచ్చరించారు. మోడీ సర్కార్ దిగివచ్చేంత వరకు ఉద్యమాలకు విరామం లేదు అని ఏజే రమేష్ స్పష్టం చేశారు. రాస్తారోకో సందర్భంగా కార్మిక కర్షకులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో బ్రిడ్జి సెంటర్ పరిసర ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు ఎం.బి సర్పారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం స్వామి, సిఐటియు జిల్లా నాయకులు ఎర్రం శెట్టి వెంకట రామారావు, కొలగాని రమేష్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జీవనజ్యోతి, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సున్నం గంగ, పట్టణ కన్వీనర్ కుంజ శ్రీనివాస్, డివైఎఫ్ ఐ పట్టణ నాయకులు సతీష్ బాలు, భూపేంద్ర, ఎస్ఎఫ్ఐ టౌన్ సెక్రెటరీ రవీంద్ర, సిఐటియు నాయకులు అనురోజు నరసింహ చారి, చాట్ల శ్రీనివాసరావు. ఎస్కే జాకీర్, మార్బుల్ చంటి, స్క్రీం వర్కర్లు, చంద్ర లీల, వెంకటలక్ష్మి, లలిత, ఐద్వా నాయకులు లీలావతి, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





