న్యూదిల్లీ, నవంబర్ 1:శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మృతులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, తొక్కిసలాటలో పలువురు గాయపడటం, వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





