– మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో..
వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 11: జ్ఞాపకశక్తి లోపం, తరచూ వస్తువులు మర్చిపోవడం, మందులను పునరావృతంగా తీసుకోవడం, సంభాషణలను గుర్తుంచుకోలేకపోవడం, అలాగే పదేపదే మూర్ఛ (సీజర్స్) సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా రోగులకు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో విజయవంతంగా చికిత్స అందించినట్లు ఆసుపత్రి నిపుణులు వెల్లడించారు. మొదటి రోగి గత ఆరు నెలలుగా జ్ఞాపకశక్తి క్షీణించడం, వస్తువులు తప్పిపెట్టడం, రోజువారీ కార్యకలాపాలను మర్చిపోవడం వంటి సమస్యలతో పాటు రోజుకు పలుమార్లు మూర్ఛ ఎపిసోడ్స్‌తో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించారు. న్యూరాలజీ విభాగం నిపుణుల పర్యవేక్షణలో ఎమ్మారై బ్రెయిన్, వీడియో ఈసీజీ, పీఈటీ-సీటీ వంటి అధునాతన పరీక్షలు నిర్వహించగా మెదడులోని టెంపోరల్ లోబ్‌లో అసాధారణ మార్పులు గుర్తించారు. అనంతరం నిర్వహించిన ఆటోఇమ్యూన్ మరియు పారా-నియోప్లాస్టిక్ ప్యానెల్ పరీక్షల్లో ఎల్‌జీ11 రిసెప్టర్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే రోగికి IV పల్స్ స్టెరాయిడ్స్‌తో పాటు రిటుక్సిమాబ్ చికిత్స అందించగా జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడటంతో పాటు మూర్ఛ ఎపిసోడ్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రోగి ఎంఎంఎస్ ఈ స్కోర్ 15/30 నుంచి 25/30కి పెరగడం చికిత్స విజయాన్ని ప్రతిబింబిస్తోందని వైద్యులు తెలిపారు. ఇదే తరహా లక్షణాలతో మరో మహిళా రోగి స్పృహలో మార్పులు మరియు మూర్ఛ సమస్యలతో మెడికవర్ హాస్పిటల్స్‌ను సంప్రదించారు. ఆమెకు నిర్వహించిన ఎంఆర్ ఐ, పీఈటీ-సీటీ పరీక్షల్లో కూడా ఎడమ టెంపోరల్ లోబ్‌లో హైపోమెటబాలిజం గుర్తించారు. ప్రారంభ దశలో స్టెరాయిడ్స్ చికిత్స అందించగా కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, అనంతరం లక్షణాలు తిరిగి రావడంతో IVIG థెరపీ అందించారు. ఈ చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకుని సాధారణ జీవనశైలిలోకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా డా. ప్రియాంక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మాట్లాడుతూ, “ఆటోఇమ్యూన్ ఎన్‌సెఫలైటిస్ అనేది అరుదుగా కనిపించే నరాల సంబంధిత వ్యాధి. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే రోగులు పూర్తిగా కోలుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి సమస్యలు, ప్రవర్తనలో మార్పులు, తరచూ మూర్ఛలు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం” అని సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందం, ఆధునిక చికిత్సా విధానాల సహాయంతో క్లిష్టమైన న్యూరాలజీ కేసులకు కూడా విజయవంతమైన చికిత్స అందిస్తూ రోగులకు మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



