– వల పన్ని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: నగరంలో డీఎస్పీగా అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్న కేవీపీ రాజు అలియాస్ డీఎస్పీ రాజును హైదరాబాద్ సీసీఎస్ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది. తిరుపతి డీఎస్పీ పేరును ఉపయోగించుకుంటూ తనకు ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బోగస్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి బాధితులను ట్రాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ.1.20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణతోపాటు ఏపీలోనూ పలువురిని ఇదే తరహాలో మోసం చేసినట్లు నిందితుడి పై ఆరోపణలున్నాయి. నకిలీ హోదాలు, అధికారుల పేర్లు ఉపయోగించుకుని బాధితుల్లో నమ్మకం కలిగించి డబ్బులు దండుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 2021 నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న కేవీపీ రాజును ఎట్టకేలకు సీసీఎస్ ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్టు చేశారు. రాజుపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డీఎస్పీగా తనను తాను పరిచయం చేసుకుంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




