– ఆ ఇద్దరిపై వేటుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం
– నివేదికలో కఠిన చర్యలకు సిఫార్సులు
– పీసీసీ చీఫ్ కు నివేదిక అందించిన మల్లు రవి
– కాంగ్రెస్ లో క్రమశిక్షణ ముఖ్యమని స్పష్టీకరణ
– పార్టీ లైన్ దాటితే చర్యలు ఉండాల్సిందేనని వెల్లడి
– కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయాలను బట్టి చర్యలు
– మీడియా సమావేశంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: కాంగ్రెస్ లో రెండు వికెట్లు పడబోతున్నాయి. కాంగ్రెస్ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు నేతలను ఆయా పదవుల నుంచి తొల గించబోతున్నారు. పిసిసి క్రమశిక్షణా కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉండ బోతున్నాయని తెలుస్తోంది. ఈ కక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అందిం ది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఈ నివేదికను మహేశ్ కుమార్ గౌడ్కు అందజేశారు. కొండా సురేఖ. చిన్నారెడ్డిపై చర్యలకు కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించాల్సిందని కమిటీ అభిప్రాయపడి నట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి క్రమశిక్షణా కమి టీ సమర్పించిన నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలను వారి పదవుల నుంచి తక్షణమే తప్పించాలని కమిటీ తన నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేసినట్లు సమాచారం. వీరిద్దరి వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు, శైలి వల్ల పార్టీకి మాత్రమే కాకుండా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజల్లో తీవ్ర చెడ్డపేరు వస్తోందని కమిటీ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. సీనియర్ నాయకులుగా ఉండి పార్టీ రహితమైన, వివాదాస్పద రీతిలో ప్రవర్తించడం వల్ల ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు.. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఐక్యతను కాపాడటానికి, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడింది. అందుకే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, అలాగే చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సిఫార్సు చేస్తూ ఉన్నత స్థాయికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన ఈ కీలక నివేదిక కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం ఏ విధమైన కఠిన నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. నివేదిక సమర్పించిన అనంతరం గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి డియాతో మాట్లాడారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ ఆధారంగా పీసీసీ అధ్యక్షుడికి నివేదిక ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ గౌరవాన్ని దెబ్బతీసే పనులు ఎవరూ చేయొద్దని.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దన్నారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చాం. హద్దులు దాటిన నేతలందరికీ స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉండాలని నివేదిక ఇచ్చాం అన్నారు. అందులో ఏముందో ముందే చెబితే అధిష్ఠానం నుంచి నాకు నోటీసులు వస్తాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎవరూ బయటపెట్టొద్దని ప్రధానంగా నివేదికలో పేర్కొన్నాం. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యక్తిగతంగా కలవలేదు. గాంధీభవన్‌లో వివరణ లేఖ ఇచ్చి వెళ్లారు. ఈ నివేదికను సీఎం రేవంత్‌కు ఇవ్వలేదు. పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి పీసీసీ అధ్యక్షుడికి అందజేశాం. ఈ విషయంలో ఊహాజనిత అంశాలు ప్రచారం చేయొద్దని మల్లు రవి అన్నారు. అయితే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పీసీసీ అధ్యక్షుడికి సమర్పించిన నివేదికలో క్రమశిక్షణ కమిటీ పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. పార్టీ నియమాలను కొండా సురేఖ ఉల్లంఘించడం ఇది మూడోసారి. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని, సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న చిన్నారెడ్డి పార్టీలో సుదీర్ఘకాలం ఎన్నో పదవులు అనుభవించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన కూడా పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారు. క్యాబినెట్ ర్యాంకు పదవిలో ఉన్న చిన్నారెడ్డిని కూడా ఆ పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పూర్తి అంశాలతో నివేదికను పొందుపరిచి టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు అందజేశారు. దీనిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ నాక్షి నటరాజన్‌కు పంపారని తెలిపారు. మంగళవారం వీరిపై డియాలో వచ్చిన కథనాలను చూసి ఓ అంచనాకు వచ్చామని మల్లు ర వి పేర్కొన్నారు. అలాగే గత విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, పార్టీ జనరల్ సెక్రటరీకి కూడా పంపిస్తారని అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నాయకులు, క్యాడర్‌కు ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నామని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కమిటీలో క్రమశిక్షణ ప్రధానమైనదని పేర్కొన్నారు. క్రమశిక్షణపైనే పార్టీ గౌరవం ఆధారపడి ఉంటుందన్నారు. ఆ గౌరవం ఉంటేనే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. పార్టీపై నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం దీనిపై సక్షించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ వివరాలను డియా ద్వారా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




