– యోగి సహా 52మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
న్యూదిల్లీ, ఆగస్ట్ 22 : ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేశారు. సుమారు 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ఖరీదు సుమారు రూ.10 లక్షలు ఉన్నట్లు భావిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతికి కూడా ఆ జాకెట్లను అందజేశారు. భద్రతలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. వీరితో పాటు ఆ జాబితాలో 11 మంది మంత్రులు ఉన్నారు. సంజయ్ నిషాద్, నంద్ గోపాల్ గుప్తా, ఓం ప్రకాశ్ రాజ్‌భర్, బీజేపీ నేత అపర్ణయాదవ్ ఉన్నారు. తొలి దశలో 8 మందికి, రెండో దశలో 44 మందికి జాకెట్లను అందజేశారు. బీజేపీ నేతలు స్వతంత్ర దేవ్ సింగ్, జైవీర్ సింగ్, మహేంద్ర సింగ్‌కు కూడా జాకెట్లు ఇచ్చారు. యూపీలోని సుమారు 98 మంది ఇతర ముఖ్య నేతలకు ప్రత్యేకమైన భద్రతను కల్పించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




