రాచరికం నుంచి ప్రజాస్వాంలోకి..

  • గత పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
  • పదేళ్లలో మొదటిసారిగా, డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీల పెంపు
  • డోర్నకల్ నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
  • అర్హులంద‌రికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • రాష్ట్ర రెవెన్యూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో గత పదేళ్లుగా విద్యావ్యవస్థను పట్టించుకున్నవారే లేరని, పేదల విద్యను పట్టించుకోకుండా రాచరికపు పాలన కొనసాగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాట‌య్యాక బడుగు బలహీన వర్గాలకు చేయూతనందిస్తూ.. ఆర్థిక సంక్షోభాన్ని భరిస్తూ ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు విద్యను నిర్లక్ష్యం చేశారని, వారి పాలనలో వసతి గృహాలను పడావుపడిన రైస్ మిల్లుల్లో, పాత అద్దె భవనాల్లో పాఠ‌శాల‌ల‌ను నిర్మించార‌ని ఆరోపించారు. వాస్తవానికి ఇప్పుడున్న వసతి గృహాల‌న్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినవేన‌ని గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన మరిపెడ మండంలోని పలు వసతి గృహాల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్ట‌ర్‌ జాటోతు రాంచంద్రునాయక్ తో కలిసి పాల్గొన్నారు. తొలుత మరిపెడ పీహెచ్ సీలో సిరోలు, దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన మూడు నూతన 108 వాహనాలను ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ సందర్శించి రిజిస్టర్ తనిఖీ చేశారు. అనంతరం నర్సింహులపేట తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం , సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల వసతి గృహాల్లో మెను ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్ల‌లో ఒకే ర‌క‌మైన‌ డైట్ ప్లాన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రారంభించారని, రాష్ట్రంలో గత పదేళ్లలో మొదటిసారిగా, సంక్షేమ హాస్టళ్ల చరిత్రలో మరెన్నడూ లేని విధంగా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకొని అమలుపరుస్తున్నామన్నారు. పెంచిన డైట్ ఛార్జీలలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ. బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ లో అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించి, అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితులను అంచనా చేస్తార‌నితెలిపారు.

రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటుచేశామ‌ని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టామన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించే కార్యక్రమంతో పాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page