తమిళనాడులో మళ్లీ స్టాలిన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ໖໖ 29 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (2026) పోలింగ్ పర్వం ముగియడం తో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. రికార్డు స్థాయిలో 84 శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ‘పీపుల్స్ ప ల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. గత నాలుగు దశా బ్దాలుగా ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ, స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే రెండోసారి పీఠాన్ని దక్కించుకోబోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు (మొత్తం స్థానాలు: 234): డీఎంకే కూటమి: 125 – 145 స్థానాలు (ఓట్ల శాతం: 38.4%), ఏఐ డీఎంకే కూటమి: 65 – 80 స్థానాలు (ఓట్ల శాతం: 31.5%), ໖໖ ( 2 ): 18 – 24 ( శాతం: 23.6%), ఇతరులు: 02-06 స్థానాలు. కాగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. 18-24 ఏళ్ల యువతలో టీవీకేకు 32.3 శాతం మద్దతు లభించినప్పటికీ, 34.9 శాతంతో డీఎంకే ముందంజ లో నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో మహిళలు డీఎంకే (37.8%) వైపు మొగ్గు చూపారు.

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. ఎన్డీఏ కూటమిదే అధికారం 

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారతీయ జనతా పార్టీ తన జైత్రయాత్రను కొనసాగించ బోతోంది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలెయెన్స్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ సాధించబోతోందని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
ఎగ్జిట్ పోల్ అంచనాలు (మొత్తం స్థానాలు: 126): మెజార్టీకి 64 స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ కూటమి అంతకంటే ఎక్కువే సాధించబోతోంది. బీజేపీ 68 -72 స్థానాలు (ఓట్ల : 38.6%), 5 22 – 26 (໖ 36.5%), ఏజీపీ 07 – 10 స్థానాలు, బీపీఎఫ్ 08 09 స్థానాలు, మొత్తం ఎన్డీఏ కూటమికి దాదాపు 90 స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు సర్వే అంచాలు చెబుతున్నాయి. అప్పర్ అస్సాం ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. మధ్య అస్సాంలో నాగావ్, హూజాయ్, కర్బి అంగలాంగ్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. లోయర్ అస్సాంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఏఐయూడీఎఫ్గతంలో కంటే కొంత బలోపేతమైనా, ఓవరాల్ గా ఎన్డీఏ ఆధిపత్యమే కొనసాగిందని సర్వే వెల్లడించింది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి అస్సాం ప్రజలు నీరాజనాలు పట్టారు. సర్వేలో 45 శాతం మంది ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్కు 35 శాతం మద్దతు లభించింది. ఏఐయూడీఎఫ్, రాయిజర్ దాల్ వంటి ఇతర పార్టీల ప్రభావం ఈసారి ఎన్నికల్లో చాలా నామమాత్రంగానే కనిపిస్తోంది.

పుదుచ్చేరిలో మళ్లీ రంగస్వామి హవా 

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోబోతోందని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్డీఏను మళ్లీ పీఠంపై కూర్చోబెట్టబోతున్నాయని సర్వే విశ్లేషించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు (మొత్తం స్థానాలు: 30): మెజార్టీకి 16 స్థానాలు అవసరం కాగా, ఎన్డీఏ కూటమి సునాయాసంగా ఆ మార్కును దాటబోతోంది. ఎన్డీఏ కూటమి: 16 – 19 స్థానాలు (ఓట్ల శాతం: 34% – 36%), ఎస్పీఏ కూటమి: 10 – 12 స్థానాలు (ఓట్ల శాతం: 30% – 32%) టీవీకే, ఎన్ఎమ్కే కూటమి: 15% – 17% ఓట్లు ఇతరులు: 01 – 02 స్థానాలు పార్టీల వారీగా సీట్ల అంచనా: ఎన్డీఏ కూటమి: ఏఐఎస్ఆర్సి10-12 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవనుంది. బీజేపీ 5-6, ఎల్సేకే 1-2, ఏఐఏడీఎమ్కే 0-1 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎస్పీఏ కూటమి: డీఎమ్కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలకే పరిమితం కానున్నాయి. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని 65 శాతం మంది ఓటర్లు బలంగా అభిప్రాయ పడ్డారు. అభివృద్ధి విషయంలో 56 శాతం మంది ప్రజలు ఏఐఎన్ఆర్సి వైపు నిలవగా, కాంగ్రెస్కు కేవలం 24 శాతం మద్దతు లభించింది. దాదాపు 60 శాతం మంది ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వాలని కోరుకోవడం విశేషం.

కేరళలో మళ్లీ మారిన తీర్పు- యూడీఎఫ్ వైపే కేరళీయుల మొగ్గు

తిరువనంతపురం, ఏప్రిల్ 29 కేరళ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికే ప్రజలు మళ్లీ జై కొట్టారు. 2016, 2021లో వరుసగా రెండుసార్లు విజ యకేతనం ఎగురవేసిన వామపక్షాల ఎల్డీఎఫ్ (LDF) కూటమిక్ ఈసారి భంగపాటు తప్పదని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికార పీఠాన్ని దక్కిం చుకోబోతోందని సర్వే అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు (మొత్తం స్థానాలు: 140): మెజార్టీకి 71 స్థానాలు అవసరం కా గా, యూడీఎఫ్ సునాయాసంగా ఆ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. యూడీఎఫ్ కూట మీకి 75-85 స్థానాలు, ఎల్డీఎఫ్ కూటమికి 55 – 65 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 0- 03 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల శాతంలో యూడీఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యంలో ఉంది.

 ప్రభుత్వంపై సంతృప్తి ఉన్నా తిప్పికొట్టిన ఓటర్లు

విశేషం ఏమిటంటే, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ పనితీరుపై 55.1 శాతం మంది సంతృప్తి వ్య క్తం చేసినప్పటికీ, అధికారం కట్టబెట్టే విష యంలో మాత్రం వెనుకడుగు వేశారు. 42 శా తం మంది ఓటర్లు ఎల్డీఎఫ్ కు మరోసారి అవ కాశం ఇవ్వడానికి నిరాకరించారు. ఇక ము ఖ్యమంత్రి రేసులో పినరయ్ విజయనకు 22.3 శాతం మద్దతు లభించగా, కాంగ్రెస్ నేత వి.డి. సతీషన్ కు 14.5 శాతం మద్దతు లభించింది.

చతికిలపడ్డ ఎన్డీఏ ‘డబుల్ ఇంజన్’ : ప్రచారానికీ నో

కేరళలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. రాష్ట్రంలో మూడు ఫ్రంట్లు అవసరం లేదని 59.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వంపై 50.9 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా బీజేపీ వినిపిస్తున్న ‘డబు ల్ ఇంజన్ సర్కార్’ నినాదం కేరళీయులను ఏమాత్రం ఆకట్టుకోలేదని సర్వే తేల్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *