సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం

ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ ‌శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ ‌క వెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం వరకు హరీష్‌ ఉన్న గది తలుపులు తెరుచుకోక పోయేసరికి అనుమానంతో రిసార్ట్ ‌సిబ్బంది పోలీస్‌ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీస్‌ అధికారులు రిసార్ట్ ‌కు చేరుకొని తలుపులు బద్దలు కొట్టి తెరిచి చూడగా పెరిరో రిసార్ట్ ‌లో తన సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌తో కాల్చుకొని రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు.

ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ ‌హరీష్‌ ‌ది జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ములుగు జిల్లా ఎస్పీకి సమాచారం అందజేశారు. జిల్లా ఎస్పీ శబరీష్‌, ‌సర్కిల్‌  ఇన్‌ ‌స్పెక్టర్‌ ‌బండారి కుమార్‌ ‌హుటాహుటిన అక్కడికి చేరుకొని హరీష్‌ ‌మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన గదిని పరిశీలించి ఫోరెన్సిక్‌ ‌నిపుణులతో ఆధారాలను సేకరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్‌ఐ ‌హరీష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

కేసు నమోదు చేసుకొని ప్రత్యేక అధికారిని విచారణ అధికారిగా నియమించి ఆత్మ హత్యకు గల కారణాలను సేకరిస్తామని అన్నారు. కాగా వ్యక్తిగత కారణాలే కాక ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మరో వైపు ఎస్సై ఆత్మహత్య చేసుకున్న గది ముందు ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విల పిస్తుండడం అందరినీ కలిచివేసింది.

వాజేడు మండలంలో విషాదం.
2022 బ్యాచ్‌ ‌కి చెందిన హరీష్‌ ‌విధుల్లో చేరిన తర్వాత మొదటిసారిగా వాజేడులో ట్రైనీ ఎస్సైగా పనిచేశారు. కొద్ది నెలల్లోనే మండల పరిధిలోని పేరూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం పాటు పేరూరులో విధులు నిర్వర్తించి ములుగు విఆర్‌ ‌కు బదిలీ అయ్యారు. మరలా 2024లో వాజేడు ఎస్సైగా విధుల్లో చేరారు. నాటి నుంచి నేటి వరకు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మృధుస్వభావిగా పేరుపొందారు. . అయితే ఒక్కసారిగా ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో వాజేడు ప్రజలు షాక్‌ ‌కు గురయ్యారు.  మరోవైపు  హరీష్‌ ‌విధుల్లో చురుకుగా పాల్గొనేవాడని వాజేడు మండలంలో చాలా ఇష్టంలో పనిచేసేవాడని ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page