~మేం టి హబు తెస్తే వారు అనుముల హబ్స్ దోపిడీ
~మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్12: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకో ణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. నిజమైన స్టార్టప్లు ఎదగాలని, నిరు ద్యోగ యువతకు ఉపాధి దక్కాలని తాము కష్టపడి టి హబ్’ను నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇది ఫ్యామిలీ-రన్.. ఫ్యామిలీ-డ్రైవ్.. జీరో ఇన్నోవేషన్.. జీరో ఎంప్లాయీస్ స్కామ్ అంటూ ఆరోపించారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. ఎటువంటి ప్రశ్నలు లేకుండా వందల కోట్లు విలువైన భూములు దక్కించుకో వచ్చంటూ సెటైర్ విసిరారు. ‘సున్నా పెట్టుబడితో టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అనే డిఫె న్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం రూ. 200 కోట్ల లాభం ఆర్జించినందుకు ‘ఇన్నో వేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాల్సిందే. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన ‘బిజినెస్ మోడల్’ ఏంటో నేర్పించండి. వంద ల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి. ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలి? తెలంగాణ యువత మొత్తానికి ఈ ‘అనుములు హబ్’ అవకాశాన్ని కల్పించండి’ అంటూ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



