– కుటుంబాన్ని ప్రభావితం చేసే వ్యాధి
– ఒకవైపు మందులు, మరోవైపు ఆర్థిక భారం
– అందుకే బాధిత చిన్నారులకు పింఛను సదుపాయం
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సుబేదారి, ప్రజాతంత్ర, ఆగస్టు 10: : తల సేమియా – సికెల్ సెల్ వ్యాధి బాధితుల కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈనెల 15 నుంచి పెన్షన్ సౌకర్యం ప్రకటించిన సందర్బంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండలో పాలకవర్గం, తలసీమియా – సికెల్ సెల్ చిన్నారులు తల్లితండ్రులు, శ్రోయోభిలాషులు కృతజ్ఞత సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెవెన్యూ గృహ నిర్మాణ & సమాచార శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తలసీమియా వ్యాధి బాధితుల పెన్షన్ రిజిస్ట్రేషన్ కు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ స్టాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు. అనంతరం రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మన తలసీమియా, సికిల్ సెల్ చిన్నారులు, వారి తల్లిదండ్రుల మధ్య ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒంటరిగా లేరు. మీ పిల్లల కోసం ప్రభుత్వం ఉంది. మీ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. తలసీమియా అనేది ఒక చిన్నారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఆ కుటుంబం మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే సమస్య. ప్రతి నెల రక్తం కోసం ఆసుపత్రికి రావాలి. వైద్యం చేయించాలి. మందులు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు నిరంతరం ఆందోళన చెందాలి. బిడ్డ ఆరోగ్యం ఒకవైపు.. ఆర్థిక భారం మరో వైపు. ఆ బాధను ప్రభుత్వం అర్థం చేసుకుంది. అందుకే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తలసీమియా, సికిల్ సెల్ బాధిత చిన్నారులకు పెన్షన్ అందించే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15నుంచి పెన్షన్ ప్రారంభం కానుంది. ఇది కేవలం పెన్షన్ కాదు. ఒక చిన్నారికి అండ. ఒక కుటుంబానికి భరోసా. ఒక తల్లిదండ్రికి ధైర్యం. రాబోయే రోజుల్లో తెలంగాణను తలసీమియా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే సాధించగలిగేది కాదు. ప్రభుత్వం, రెడ్‌క్రాస్, జిల్లా పాలకమండళ్లు, జిల్లా యంత్రాంగం, వైద్యులు, రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థలు, యువత అందరూ కలిసి పనిచేయాలి. తలసీమియా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. అవసరమైన పరీక్షలు సకాలంలో చేయించాలి. వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి. ముఖ్యంగా తలసీమియా చిన్నారులకు అవసరమైన రక్తం ఎప్పటికప్పుడు అందేలా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలి. తలసీమియా చిన్నారుల కోసం నిరంతర రక్త సరఫరా ఉండేలా మనందరం బాధ్యత తీసుకోవాలి. హనుమకొండ రెడ్‌క్రాస్ చేస్తున్న సేవలు ఈ విషయంలో మనందరికీ ఆదర్శం. రక్త సేవలు, తలసీమియా చిన్నారులకు సహాయం, ఆరోగ్య సేవలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా రెడ్‌క్రాస్ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అండగా నిలుస్తోంది. హనుమకొండ రెడ్ క్రాస్ కృషికి అభినందనలు. రెడ్ క్రాస్ సొసైటీ కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. హనుమకొండలో రెడ్‌క్రాస్ బలంగా పనిచేస్తున్నట్టే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రెడ్‌క్రాస్ సొసైటీలను మరింత బలోపేతం చేయాలి. రెడ్‌క్రాస్ హెల్ప్ డెస్క్, జిల్లా పాలక మండలి, జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసి ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చూడాలి. ఈ చిన్నారుల విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇప్పుడు సమాజం కూడా తన వంతు బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి. ప్రభుత్వం ఒక్కటే కాదు… మనందరం కలిసి పనిచేసినప్పుడే తలసేమియా లేని తెలంగాణ సాధ్యమవుతుంది అన్నారు. ఈ సందర్బంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినా తరువాత మొట్టమొదటి లెటర్ తలసేమియా – సికెల్ సెల్ వ్యాధి బాధితుల కోసం పెన్షన్ సౌకర్యం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ రోజు పెన్షన్ ప్రకిటించినందుకు ముఖ్యమంత్రి కి కృతఙ్ఞతలు తెయచేశారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, పాలకవర్గం తలసీమియా పిల్లలకు పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్రె, డ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ పాలకవర్గం మంత్రి ని శాలువా, షీల్డ్ తో ఘనంగా సత్కరించి కృతఙ్ఞతలు తెలియచేసినారు. హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి : బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు : ఇ. వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు: పుల్లూరి వేణు గోపాల్, బాశెట్టి హరిప్రసాద్, జీడబ్ల్యుఎంసీ కమీషనర్ టి.వెంకన్న, ఆర్డీఓ వెంకటేష్, ఏసీపీ నర్సింహారావు, డీడబ్ల్యుఓ విశ్వజ, హనుమకొండ డీఎంఅండ్‌హెచ్ ఓ అప్పయ్య, తలసీమియా ఇన్‌చార్జ్ సింగవేనా భరత్, మనోజ్, శివకుమార్, సురేష్, గంగాధర్ జీవితకాల సభ్యులు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



