కొంత చైతన్యం తీసుకు రావొచ్చు

తెలుగునాట సాహిత్య ఉత్సవాలు కొత్తగాదు,  కాకపోతే ఈ మధ్యకాలంలో విరివిగా జరుగుతున్నాయి.  అందుకు కారణమైనవాళ్ళని కచ్చితంగా అభినందించాలి. బైటరాష్ట్రాల్లో జరుగుతున్న సాహితీ ఉత్సవాలని చూస్తూ మనకి ఇక్కడ ఇలాంటివి జరిగితే బాగుండని ఎంతోమంది అనుకున్నారు. ఇప్పుడు అది నెరవేరుతుంది. ఇలాంటివి జరగడంవల్ల వివిధప్రాంతాల కవులు, రచయితలు కలుసుకునే వీలుంటుంది. అభిప్రాయాలా కలబోత ఉంటుంది అదొక్కటేకాక వేర్వేరుప్రాంతాల్లో జరగడం వల్ల ఆయాప్రాంతాల విశేషాలు తెల్సుకోవడమే కాకుండా అక్కడి విశిష్టవ్యక్తులని కలుసుకునే వీలుంటుంది.

అసలు సాహిత్యం అంటేనే మనుషులు కలుసుకోవడం కదా, ఈ ఉత్సవాలు అదేపని చేస్తున్నాయి. పరభాష నుంచి అతిధులు రావడం వల్ల వాళ్ళ రచనలు గురించి తెల్సుకోవడం ఒక ఉపయోగం. ఛాయా  రెండో సెషన్  సాహిత్య ఉత్సవం చేయడం హర్షించదగిన విషయం.  రెండు తెలుగు రాష్ట్రాల రచయితలే కాకుండా దక్షిణ భారతదేశపు భిన్నశైలిలో కథలు, కవిత్వం,చారిత్రిక నవలలు, సమకాలీన సామాజిక అంశాల్ని ప్రజల దృష్టికి తెస్తున్నవాళ్ళని తీసుకు రావడం  ముదావహం. నేను ఈ ఉత్సవంలో కవిత్వానికి సంబంధించిన సెషన్లో మోడరేటర్ గా పాల్గొంటున్నాను.  ఏ పని జరగడం లేదని  నిట్టూర్పులు విడిచే బదులు జరుగుతున్న ఉత్సవాల్లో మనకేం కావాలో తీసుకోవడం మంచిది. ప్రజావ్యతిరేక పాలకులుగా ఉన్న తరుణంలో వారిని ఎదురుకునే సత్తాని మనం ఇలాంటి సాహితీ సమ్మేళనాల ద్వారా కొంత చైతన్యం తీసుకురావొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *