ఛాయా కృషి మాత్రం బాగుంది

ఏమో మరి ! ఏం చేర్పు ఉంటుందో నాకైతే తెలియదు. గతంలో కొందరు జైలులో నుంచి, ఆసుపత్రి పడక మీద నుంచి కూడా ఏ సందడి ఎరుగకుండా రాసి లోకానికి చెప్పాల్సినవి చెప్పారు కదా. వాటిని మనం చదివి, వాళ్లు ఒంటరిగా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న గుండె వేదననో బతుకు భారాన్నో తెలుసుకున్నాం కదా. కాబట్టి ఉత్సవ వాతావరణం సాహిత్యానికి ఏం చేర్పు చేస్తుందో కానీ ఇలా ఉత్సవం చెసుకోవడమైతే తప్పు కాదు. అయితే దానివల్ల చేర్పులు మార్పులు అనేవి ఉంటాయనైతే అనుకోను. ఈ ఉత్సవం నుంచి నేనేమీ ఆశించడం లేదు.

ఛాయా కృషి మాత్రం బాగుంది. ముఖ్యంగా గత ఏడాది నుంచి మొదలైన లిట్ ఫెస్ట్ ఈ ఏడు రెండురోజులు జరపబోతుండడం, అనేకులను రప్పించి మాట్లాడించబోవడం మంచిగా అనిపిస్తోంది. తమవైన కళారంగాల్లో ఉద్ధండులైనవారే ఉన్నారు కొందరు స్పీకర్లుగా, వాళ్లని నేరుగా కలవడం కష్టం కాబట్టి ఈ లిట్ ఫెస్ట్ మేలైన ఆహ్లాదకరమైన అవకాశం. ఇక నేను రెండు వేదికల నుంచి ఇద్దరు స్పీకర్స్ లో ఒకరిగా మాట్లాడబోతున్నాను. తమిళ రచయిత చారు నివేదితతో కలిసి “నిషిద్ధ సాహిత్యం; ఓ కళారూపం” అంశం మీద, రచయిత్రి జాజుల గౌరితో కలిసి “పొలిమేరల అవతలి గొంతుకలు; కథల్లో అట్టడుగు జీవితాలు” అంశం మీద నా అభిప్రాయాలు పంచుకోబోతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *