ఆదాయానికి మించిన ఆస్తులు

– ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతోపాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దాదాపు పది ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలతోపాటు రూ.1.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నరహరితోపాటు ఆయన తమ్ముడి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. తమ్ముడి ఇంట్లోనూ భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలపై అన్నదమ్ముల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్‌గా నరహరి కీలక విధులు నిర్వర్తిస్తున్నారు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనం వంటి కీలక ఉద్యోగ బాధ్యతలను ఆయన చూస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాకు ఏడీగా నరహరి పనిచేశారు. ఆ సమయంలో కూడా భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *