– సర్వేల కోసం రావద్దని తెలిపినట్లు సమాచారం
బెంగళూరు, అక్టోబర్ 16: కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వేకు దూరంగా ఉండాలని, అందులో తాము పాల్గొనబోమని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు స్పష్టం చేసినట్లు సమాచారం. తాము వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని వారు అధికారులతో చెప్పినట్లు సమాచారం. సామాజిక, ఆర్థిక గణనలో భాగంగా బెంగళూరు జయానగర్‌లోని నారాయణమూర్తి నివాసానికి సిబ్బంది ఇటీవల వెళ్లారు. అయితే తమ వివరాలు చెప్పేందుకు నారాయణమూర్తి, ఆయన సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. మా నివాసంలో ఎలాంటి సర్వే నిర్వహించొద్దు. మేం వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులం కాదు. అందువల్ల ఈ సర్వేలో పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు సర్వే పత్రంపై రాసి సంతకాలు చేసినట్లు పలు ఆంగ్ల విూడియా కథనాలు వెల్లడిరచాయి. తమ ఇంట్లో ఈ సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండబోదని పేర్కొంటూ నారాయణమూర్తి దంపతులు స్వీయ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించినట్లు సమాచారం. కాగా, దీనిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ సర్వేలో పాల్గొనాలని తాము ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా చేపడుతున్న గణన అని స్పష్టం చేశారు. కాగా, ఈ సర్వేపై కర్ణాటకలో పెద్దఎత్తున వ్యతిరేకతలు వచ్చాయి. హైకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని న్యాయస్థానం తోసిపుచ్చింది. సామాజిక, ఆర్థిక సర్వేను అడ్డుకోలేమని చెప్పింది. అయితే బలవంతంగా వ్యక్తిగత వివరాలు సేకరించరాదని, సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించాలని సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





