హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న విధుశేఖర భారతి స్వామీజీకి నారాయణపేట జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ ఆశ్రమానికి చేరుకున్న శృంగేరి స్వామికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఎండోమెంట్స్ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావులతోపాటు ఎండోమెంట్స్ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





