రాజకీయాల్లో కళ్లు, చెవులుగా సోషల్ మీడియా

– అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి
– విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి.
– మంత్రి పొన్నం పిలుపు
– హుస్నాబాద్ కాంగ్రెస్ సోషల్ మీడియా సన్నాహక సమావేశం

హుస్నాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవైద్యరంగంలో స్పెషలైజేషన్ ప్రాధాన్యత పెరిగినట్లే. రాజకీయాలలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సోషల్ మీడియా ద్వారా విపక్షాలు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సాధించిన మార్పులను, చే సిన అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా వివరిం చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, ఇం దిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి ప్రతిష్టాత్మక పథకాలను విస్తృతంగా ప్రజల్లోకితీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రుణ మాఫీ లబ్దిదారులతో స్వయంగా వీడియోలు తీయించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

జనవరిలో భారీ జాబ్ మేలా

మంత్రి పొన్నం నియోజకవర్గంలో చేపడుతు న్న సంక్షేమ, అభివృద్ధి పనులను వెల్లడించా రు. నియోజకవర్గంలోని దివ్యాంగులు. వృ ద్ధులకు అలింకో సంస్థ ద్వారా చేతికర్రలు, బ్యాటరీ రిక్షాలు, కృత్రిమ కాళ్లు/చేతులు, విని కిడి పరికరాలను ఉచితంగా అందిస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వందలాది కంపెనీలతో జనవరి నెలలో భారీ ఎత్తున జాబ్ మేలా నిర్వహిస్తున్నాం. గ్రామీణ యువత కోసం ప్రతి గ్రామానికి రూ.1 లక్ష (పెద్ద గ్రామాలకు రూ. 2 లక్షలు) కేటాయించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నాం. హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో పాటు కళలు, నృత్యం వంటి అంశాల్లో శిక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నాం..

ప్లాస్టిక్ రహిత నియోజకవర్గమే లక్ష్యం

అన్ని గ్రామాల్లో తాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయడంతోపాటు హుస్నాబాద్ ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు ప్రత్యామ్నాయ వస్తువులు, హోటళ్లకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం ఉండదని, కేవలం అర్హత ఉన్న పేదలకే న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేర్చాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టెం నవీన్, వైస్ చైర్మన్ అనురాగ్ దాసరపు, మున్సిపల్ చైర్మన్ దండి లక్షి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఏడు మండలాల అధ్యక్షులు, పార్టీ గ్రామ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *