– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధి గోపాల పురంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం కలె క్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ విద్యార్థుల కోసం తాత్కాలిక షెడ్డు నిర్మించేందుకు టీచర్ సుమారు రూ.40 వేల సొంత డబ్బును వెచ్చించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను అత్యంత ప్రాధాన్యతా రంగాలుగా భావించి పనిచేస్తోం దన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్ లుగా అప్గ్రేడ్ చేస్తున్నామని. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ఏటీసీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలతో కూడిన కోర్సుల్లో శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పొందడంతోపాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ అవస రాలను దృష్టిలో ఉంచుకుని ఏటీసీలను దూరదృష్టితో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూ క్యా శ్రీనివాస్, ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహశీల్దార్ విల్సన్, ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లమల్ల కీర్తి నీరన్ కుమార్ పాల్గొన్నారు. ఎర్రగడ్డ గ్రామంలో నిర్వహించిన ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను చెట్టుగా మారే వరకు పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు సంరక్షించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




